నేటితరానికి కనెక్ట్ అయ్యేలా..‘శాకుంతలం’

నేటితరానికి కనెక్ట్ అయ్యేలా..‘శాకుంతలం’

తనను ఎగ్జయిట్ చేసిన శకుంతల క‌‌థ‌‌ను జ‌‌నాల‌‌కు ఇంకా ఎగ్జయిటింగ్‌‌గా చెప్పొచ్చనే  ఆలోచ‌‌న‌‌తో ‘శాకుంతలం’ తీశానంటున్నారు గుణశేఖర్. సమంత ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన ఈ మైథాలాజికల్ మూవీని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు.  ఏప్రిల్ 14న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా గుణశేఖర్ చెప్పిన విశేషాలు. 

  • ప్రేమ‌‌తో పాటు మంచి వేల్యూస్ ఉన్న చిత్రమిది. లాక్‌‌డౌన్ టైమ్‌‌లో ఓ ఎపిక్  ల‌‌వ్‌‌స్టోరీ చేద్దామ‌‌ని.. కొన్ని పురాణాలు, ఇతిహాసాలు స్టడీ చేశా. అప్పుడే ‘అభిజ్ఞాన శాకుంత‌‌లం’ ఎట్రాక్ట్ చేసింది. దాన్ని సోష‌‌లైజ్ చేయ‌‌డం కంటే అలాగే తీస్తే బెట‌‌ర్ అని ఈ సినిమా మొద‌‌లు పెట్టా. ఏడాది ప్రీ ప్రొడ‌‌క్షన్ వ‌‌ర్క్ చేసి,  ఐదు నెల‌‌ల్లో షూటింగ్ పూర్తి చేశాం. మరో ఏడాదిన్నర పాటు పోస్ట్ ప్రొడ‌‌క్షన్‌‌కి టైమ్ తీసుకున్నాం. 
  • శ‌‌కుంత‌‌ల అన‌‌గానే శృంగార నాయిక గుర్తుకొస్తుంది. కానీ ఇంటర్నల్‌‌గా  ఆమెలో చాలా శ‌‌క్తి ఉంటుంది. స‌‌మంత మంచి న‌‌టి కాబ‌‌ట్టి.. శ‌‌కుంత‌‌ల పాత్రలో రొమాంటిక్ యాంగిల్‌‌కు సెకెండ్ ప్రయారిటీ ఇచ్చాను. పెర్ఫామ‌‌ర్‌‌గా ఆ క్యారెక్టర్‌‌ను డిజైన్ చేశాను. పెళ్లి కాకుండా త‌‌ల్లి కావ‌‌టం అప్పట్లో పెద్ద నేరం. అలాంటి ప‌‌రిస్థితుల‌‌ను ఆమె ఎలా ఫేస్ చేసిందనేది క‌‌థాంశం. అన్ని రంగాల్లో ఫైట్ చేస్తూ, గుర్తింపును అందుకుంటున్న నేటిత‌‌రం అమ్మాయిల‌‌కు శ‌‌కుంత‌‌ల క‌‌నెక్ట్ అవుతుంది.
  • శ‌‌కుంత‌‌ల‌‌కు జంతువులే స్నేహితులు. కాబ‌‌ట్టి జంతువుల‌‌ను పాత్రలుగా చిత్రీక‌‌రించాలి. అందుకే సీజీ మీద ఆధార‌‌ప‌‌డాల్సి వ‌‌చ్చింది. ఇప్పుడు ఆడియెన్స్ చాలా అడ్వాన్డ్స్‌‌గా ఉన్నారు. కాబ‌‌ట్టి వాటిని స్క్రీన్‌‌పై రియలిస్టిక్‌‌గా చూపించడానికి 14 స్టూడియోస్‌‌తో క‌‌లిసి ప‌‌ని చేశాం. 
  • స‌‌మంత గతంలోనూ డిఫ‌‌రెంట్ రోల్స్ చేసినా అవన్నీ అల్ట్రామోడ్రన్ క్యారెక్టర్స్. ఆమెను క్లాసిక‌‌ల్ బాడీ లాంగ్వేజ్‌‌తో చూపించాలి. దీనికోసం సమంత ట్రైనింగ్ కూడా తీసుకుంది. దుష్యంతుడి క్యారెక్టర్‌‌లోని షేడ్స్ వల్ల మ‌‌న హీరోలు అంగీక‌‌రించ‌‌రు. అడిగి లేద‌‌నిపించుకోవ‌‌టం ఇష్టం లేక‌‌.. మలయాళ హీరో దేవ్‌‌ మోహన్‌‌ను తీసుకున్నా. అలాగే దుర్వాస మ‌‌హాముని పాత్రను తాను త‌‌ప్ప మరెవరు చేయలేరు అన్నంతగా మెప్పించారు మోహన్ బాబు. మ‌‌ణిశ‌‌ర్మ ఫస్ట్ టైమ్ పీరియాడిక్ మూవీకి మ్యూజిక్‌‌ ఇచ్చారు. 
  • నిజానికి ‘శాకుంతలం’ కంటే ముందు ‘హిర‌‌ణ్య క‌‌శ్యప’ కోసం 5 ఏళ్లు వ‌‌ర్క్ చేశా. అందులో 2 ఏళ్లు స్క్రిప్ట్ వర్క్, 3 ఏళ్లు ప్రీ ప్రొడ‌‌క్షన్ వర్క్ చేశా. షూటింగ్‌‌ స్టార్ట్ చేసే టైమ్‌‌కి కొవిడ్ వచ్చింది. అదే స‌‌మ‌‌యంలో మాతో ఉన్న ఓ హాలీవుడ్ సంస్థ మ‌‌రో వ‌‌ర్క్‌‌పై ఫోక‌‌స్ పెట్టింది. దాంతో ఆ ప్రాజెక్ట్‌‌ను హోల్డ్‌‌లో పెట్టాం.