Harish Shankar: ముసలి నక్క మళ్ళీ నా జోలికొస్తుంది..రిలీజ్ అయినా వదలనంటూ హరీష్ శంకర్ వార్నింగ్!

Harish Shankar: ముసలి నక్క మళ్ళీ నా జోలికొస్తుంది..రిలీజ్ అయినా వదలనంటూ హరీష్ శంకర్ వార్నింగ్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) తాజాగా పెట్టిన పోస్ట్ సంచలనం రేపుతోంది.హరీశ్ శంకర్‌ తన సినిమా అప్‌డేట్‌లను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో పాటు అభిమానులకు రిప్లయ్‌ ఇస్తూ వారికి ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. అయితే,కొన్నిసార్లు ట్వీట్స్ వార్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇపుడు అలాంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఒకటి ట్విట్టర్ Xద్వారా షేర్ చేశారు. 

వివరాల్లోకి వెళితే..ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ రెండు సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు.అందులో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ కాగా మరొకటి రవితేజతో మిస్టర్ బచ్చన్.ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోతుందంటూ ఓ నెటిజన్ నుంచి కామెంట్స్ వినపడగా గట్టి వార్నింగ్ తో ఇచ్చిపడేశాడు. 

ఇక తాజాగా మిస్టర్ బచ్చన్ మీద గత కొన్ని రోజులుగా పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఎందుకంటే, ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చే నెల ఆగష్టు 15న రిలీజ్ కు రెడీ అవుతుంది.దీంతో ఈ సినిమాకి సంబంధించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు ఊపందుకుంటున్నాయి.

కొంత మంది జర్నలిస్టులు కూడా ఈ సినిమాకి సంబంధించిన లీకులు ఇస్తు వస్తున్నారు.అయితే సినీ సర్కిల్ లో వినిపిస్తున్న గుసగుసల మేరకు..ఒక సదరు జర్నలిస్ట్ గురించి డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా చేసిన ట్వీట్..ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

‘రిలీజ్ దగ్గర పడుతుంది కదా, ఏం పోస్ట్ చేసిన భయపడి తగ్గుతాడు అని ఒక ముసలి నక్క మళ్ళీ మొదలు పెడుతోంది.దయచేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి..నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను’అంటూ హరీష్ శంకర్ వార్నింగ్ ఇచ్చారు.అయితే,ఎవరిపై ఇంతటి కామెంట్స్ చేశాడనేది క్లారిటీ రావాల్సి ఉంది.