ఆగస్టు 14వ తేదీ సాయంత్రం ఏడు గంటలు ఐదు నిమిషాల నుంచి మిస్టర్ బచ్చన్ షోలు మొదలవుతావని డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) తెలిపారు. సోమవారం రాత్రి (ఆగస్ట్ 12న) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.
ఈ ఈవెంట్‌లో హరీష్ శంకర్ మాట్లాడుతూ.."కత్తిలాంటి కుర్రాళ్ళు అందరూ కర్నూల్ లోనే ఉన్నారా అనిపిస్తోంది ఈ ఫంక్షన్ చూస్తుంటే. నా ఈ బచ్చన్ ఇంత అద్భుతంగా ఉండటానికి కారణమైన లిరిస్టులకు, డైలాగ్ రైటర్ కు, రైటింగ్ టీం కి ధన్యవాదాలు తెలిపాడు.ఈ సినిమా ఆగస్టు 15 ఉదయం నుంచి గ్రాండ్ గా మార్నింగ్ షో లు షురూ కానున్నాయి. అలాగే మా సినిమాతో పాటు మా గురువుగారు (పూరీ జగన్నాధ్) డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో మొహమాట పడకండి రెండు సినిమాలు చూసి బ్లాక్ బస్టర్ హిట్ చేసేయండి అన్నారు" హరీష్.
అలాగే 'తల్లి ఒకేసారి జన్మనిస్తారు. కానీ నాకు దర్శకుడిగా జన్మనీ, పునర్జన్మనీ ఇచ్చిన నా హీరో,నా అన్నయ్య రవితేజ (Ravi Teja). జీవితంలో ఈ స్థాయికి వచ్చినా, ఈ వేదికపై నిలబడినా కారణం ఆయనే. చాలా ఏళ్ల తర్వాత ఆయనతో సినిమా కోసం సెట్‌కి వెళ్లినప్పుడు ఎక్కడా లేని ప్రశాంతత, ఎనర్జీ వచ్చిందని తెలిపారు. ఫస్ట్ టైం నా కెరియర్లో అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఉన్నారంటే అది విశ్వ ప్రసాద్ గారు, మా లిరిసిస్టులకి కూడా మాట్లాడిన అమౌంట్ కంటే ఎక్కువే ఇచ్చారని నిర్మాత మీద ప్రశంసల వర్షం కురిపించాడు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, మాస్ మహారాజా రవితేజని ఏ స్థాయిలో ప్రేమిస్తాడో..పూజిస్తాడో చాలా సందర్భాల్లో వింటూ వస్తున్నాం. తన సినిమా ప్రస్థానానికి రవితేజ మూలవిరాట్ అని..తాను లేకపోతే ఈ జీవితం లేదని..డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రతిసారి చెబుతూ వస్తూనే ఉన్నారు.మరోసారి బచ్చన్ స్టేజిపై కూడా తన కృతజ్ఞతను తెలపడం మాస్ రాజా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.
ఇక ఇటీవలే రవితేజ బర్త్ డే ఆపేశాల్ గా హరీష్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. .'నా ఆకలి తీర్చావు..నా ఆనందాన్ని పంచుకున్నావు..నా ఆవేశాన్ని అర్థం చేసుకున్నావు..నా ఆశలకి ఆయువు పోశావు' ఇలా నేను ఎంత చెప్పినా..ఏమి చేసినా తక్కువే..నాకు ఎన్నో జన్మలకు సరిపడేలా ఊపిరి పోసిన..నీకు..జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య' లవ్ యూ ఫరెవర్ అంటూ తెలిపారు.