V6 News

సోషల్ మీడియా ఉందని ట్వీట్లు వేయాలా: అఖండ 2 వల్లే నీ సినిమా తెలుస్తుంది.. డైరెక్టర్ మారుతి కామెంట్స్

సోషల్ మీడియా ఉందని ట్వీట్లు వేయాలా: అఖండ 2 వల్లే నీ సినిమా తెలుస్తుంది.. డైరెక్టర్ మారుతి కామెంట్స్

కలర్ ఫోటో' వంటి నేచురల్ లవ్ స్టోరీతో ఎంతో గుర్తింపు పొందాడు డైరెక్టర్ సందీప్ రాజ్. ఈ సినిమాతో టాలీవుడ్లో పాతుకుపోవడమే  కాదు.. నేషనల్ అవార్డు సాధించి తెలుగు సినిమాకు వన్నె తీసుకొచ్చాడు. ఇపుడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి రిలీజ్ కానున్న 'మోగ్లీ' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ విజువల్స్ తోనే కాకుండా డైరెక్టర్ వేసిన ట్వీట్స్తో సైతం మంచి అంచనాలు పెరిగాయి. ఈ మధ్యే అఖండ 2 డిసెంబర్ 12న వస్తుండటంతో ' నేను దురదృష్టవంతుడిని.. నాకే ఇందుకు ఇలా జరుగుతుంది. వెండితెరకు నేను అంటే ఎందుకింత కోపం" అని ట్వీట్ చేసి సినీ ఇండస్ట్రీ తనవైపు తిరిగేలా చేశాడు. ఇపుడు ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ.. డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

అసలు విషయానికి వస్తే.. మోగ్లీ మూవీ శనివారం (డిసెంబర్ 13న) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్కి గెస్ట్ లుగా రాజాసాబ్ డైరెక్టర్ మారుతి, హీరో రానా వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరూ మోగ్లీ సినిమాపై తమకున్న అభిప్రాయాన్ని పంచుకున్నారు. అయితే, శుక్రవారం 12నే రావాల్సిన మోగ్లీ.. బాలకృష్ణ అఖండ 2 వస్తుండటంతో 13న వస్తుంది. 

►ALSO READ | హైదరాబాద్లో అఖండ 2 ప్రీమియర్ షో బుకింగ్స్ ఓపెన్.. రూ.600 కాదు రూ.300లకు కూడా చూడొచ్చు !

ఈ క్రమంలో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ..'' డైరెక్టర్ సందీప్ రాజ్ చాలా టాలెంటెడ్. తన కళ, కథను తీసుకుని మోగ్లీ వంటి సినిమా రూపం తీసుకొచ్చాడు.  డైరెక్టర్ సందీప్ సంకల్పం గొప్పది. మంచి పాజిటివ్ పర్సన్. అయితే, ఈ మధ్య మాత్రం కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. సోషల్ మీడియా ఉంది కదా అని వెంటనే ట్వీట్ వేసేయేలా?

'అఖండ 2' డిసెంబర్ 12 కి వస్తుంది కాబట్టే.. మోగ్లీ సినిమా గురించి ఎక్కువ మందికి తెలిసింది. ఎందుకంటే, గతంలో చిరంజీవి గారి 'శంకర్ దాదా MBBS' పక్కన 'ఆనంద్' సినిమా వచ్చింది.. ఆ టైంకి రాకపోతే ఆ సినిమా గురించి చాలా మందికి తెలిసుండేది కాదేమో. శేఖర్ కమ్ముల వంటి డైరెక్టర్ తెలియడానికి చాలా టైం పట్టేదేమో! సో తమ్ముడూ సందీప్.. బాలయ్య బాబు బ్లెస్సింగ్స్ తో నువ్వు పెద్ద పొజిషన్ కి వెళ్ళాలి" అని దర్శకుడు మారుతి కోరారు. 

రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. మోగ్లీ రోషన్ కనకాల చూస్తుంటే.. చిరుత సినిమాలో రామ్ చరణ్ ని చూస్తున్నట్టు అనిపించింది. ఇక డైరెక్టర్ సందీప్ గురించి మాట్లాడుతూ.. టైం టెంపరరీ మాత్రమే.. ఫిలిమ్స్ ఎప్పటికీ నిలిచిపోతాయి. మీరు తీసిన కలర్ ఫోటో ఎప్పటికీ గుర్తుంటుంది. ఇప్పుడు మోగ్లీ కూడా ఎప్పటికీ నిలిచి ఉంటుందని" రానా తెలిపారు.