
ప్రిన్స్, నరేష్ అగస్త్య హీరోలుగా నటిస్తున్న సినిమా ‘కలి’. శివ శేషు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రచయిత కె రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్నారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆదివారం ఈ మూవీ టీజర్‌ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేసి.. టీజర్ ఇంటరెస్టింగ్‌గా ఉందని, టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
శివ శేషు మాట్లాడుతూ ‘సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మైథాలజీ, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్స్ కలిపిన చిత్రమిది’ అని చెప్పాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు రాఘవేంద్ర రెడ్డి. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని నిర్మాత లీలా గౌతమ్ అన్నారు.