హైదరాబాద్, వెలుగు: ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్మాస్టర్లు స్కూల్ నుం చి విద్యార్థులను బయటకు తీసుకుపోవద్దని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల క్రితం నాగర్కర్నూల్ జిల్లా సత్తాపూర్‌లో పిల్లలతో పుస్తకాలు తెప్పించేక్రమంలో రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనపై ఆయన సీరియ స్ అయ్యారు. ఘటనకు బాధ్యులైన పెద్ద కొత్తపల్లి ఎంఆర్సీలోని కాంట్రాక్టు సిబ్బందిని టర్మినేషన్ చేయాలని డీఈవోను ఆదేశించారు.
