విద్యాశాఖ ఇన్ చార్జ్ సెక్రటరీగా శ్రీధర్

విద్యాశాఖ ఇన్ చార్జ్  సెక్రటరీగా శ్రీధర్
  • టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎఫ్​ఏసీ కమిషనర్​గా కృష్ణ ఆదిత్య


హైదరాబాద్, వెలుగు: విద్యాశాఖ ఇన్ చార్జ్ సెక్రటరీగా శ్రీధర్ ను సర్కారు నియమించింది. ఆయన ఈనెల 14 నుంచి బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న కాలేజీ విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన సెలవులో వెళ్లనున్నారు. దీంతో ఆమె నిర్వహిస్తున్న విధులతో పాటు ఇన్ చార్జ్ బాధ్యతలను ఇతర ఐఏఎస్​అధికారులకు కేటాయించారు. 

ఈ మేరకు బుధవారం సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. యోగితారాణా సెలవులో వెళ్లడంతో ఇన్ చార్జ్ బాధ్యతలను శ్రీదేవసేనకు అప్పగించారు. తాజాగా ఆమె కూడా ఈ నెల 14 నుంచి డిసెంబర్ 12 వరకూ సెలవుల్లో వెళ్లనుండటంతో ఆ బాధ్యతలను పీఆర్ అండ్ ఆర్​డీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ కు అప్పగించారు. 

మరోపక్క శ్రీదేవసేన చూస్తున్న  కాలేజీ విద్యాశాఖ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ బాధ్యతలను ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యకు అప్పగించారు. సెలవులు పూర్తయిన తర్వాత తిరిగి పాత బాధ్యతల్లోనే ఆమె కొనసాగనున్నారు.