‘బబుల్గమ్’ ఫేమ్ రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. సాక్షి మడోల్కర్ హీరోయిన్. బుధవారం ఈ మూవీ టీజర్‌ను ఎన్టీఆర్ లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. ఫారెస్ట్‌లో హ్యాపీగా సాగిపోతున్న హీరో మోగ్లీ జీవితంలోకి హీరోయిన్ రాకతో ప్రపంచం మరింత కొత్తగా కనిపిస్తుంది.
తను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని, తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ‘నేను రాముడుని, తను నా సీత..’ అని గర్వంగా చెబుతాడు. రావణుడు లేడులే అనుకుంటున్న టైమ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా బండి సరోజ్ కుమార్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, తన ప్రేమను దక్కించుకునేందుకు మోగ్లీ ఎలాంటి యుద్ధం చేశాడనేది మెయిన్ కాన్సెప్ట్ అని టీజర్‌లో చూపించారు. డిసెంబర్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
