రక్షణతో పాయల్ ఇమేజ్ మారుతుంది

రక్షణతో పాయల్ ఇమేజ్ మారుతుంది

పాయల్ రాజ్‌‌పుత్ మెయిన్ లీడ్‌‌గా ప్రణదీప్‌‌ ఠాకూర్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘రక్షణ’. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రణదీప్ ఠాకూర్  మాట్లాడుతూ ‘గుణశేఖర్ గారి దగ్గర ఒక్కడు, సైనికుడు, రుద్రమదేవి చిత్రాలకు కో డైరెక్టర్‌‌‌‌గా పనిచేశాను.  దర్శకుడిగా నన్ను నేను నిరూపించుకునేందుకు ఈ సినిమా స్టార్ట్ చేశాను. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.  ఓ పోలీస్ ఆఫీసర్ లైఫ్‌‌లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కల్పిత కథను అల్లుకున్నాను.

‘ఆర్ఎక్స్ 100’ చూసి ఇందులోని పోలీస్ పాత్రకు పాయల్ బాగుంటుందని అప్రోచ్ అయ్యాం. చాలామంది తనకున్న ఇమేజ్‌‌కు ఈ సినిమా సరిపడదన్నారు. కానీ కొత్త కొత్త పాత్రలు చేసినప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు. పాయల్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. బాధితుల కోసం పోరాడే పాత్ర  ఆమెది.  పూర్తిగా రియలిస్టిక్ అప్రోచ్‌‌లో సినిమా ఉంటుంది. 47 రోజుల పాటు ఆమె షూటింగ్‌‌లో పాల్గొన్నారు. షూటింగ్ సజావుగా జరిగింది. అగ్రిమెంట్ ప్రకారం ఆమె ప్రమోషన్స్‌‌కు రావాలి. తనకు ఇవ్వాల్సిన రూ.6 లక్షల బ్యాలెన్స్‌‌ మొత్తాన్ని ప్రమోషన్స్‌‌కు వచ్చాక ఇస్తామని చెప్పాం. కానీ 20 లక్షలు ఇస్తే వర్చువల్‌‌గా ప్రమోట్ చేస్తారని ఆమె మేనేజర్ సౌరభ్ ధింగ్రా చెప్పారు.

ఈ సినిమాలో లీడ్ రోల్ ఆమెది. ప్రమోషన్‌‌లో తన ఫేస్‌‌ చూసే కదా థియేటర్స్‌‌కు వస్తారు. కాబట్టి ఆమె రావాల్సిందేనని కౌన్సిల్‌‌లో ఫిర్యాదు చేశా.  వివాదం పక్కన పెడితే.. నాకు సినిమాపై నమ్మకం ఉంది. సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం తర్వాత పాయల్ గారి ఇమేజ్ పూర్తిగా మారుతుంది. కొత్త పాయల్‌‌ను చూస్తారు. ఇకపై తనకు మరింత పవర్ ఫుల్ రోల్స్ వస్తాయి’ అని చెప్పారు.