
హీరో కార్తి, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో ‘96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘సత్యం సుందరం’. సూర్య, జ్యోతిక నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 28న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక ఫ్యామిలీ డ్రామా. కార్తి, అరవింద్ స్వామి పాత్రల మధ్య ఒక రాత్రిలో ఎలాంటి మానసిక సంఘర్షణ జరిగింది అనేది ప్రధాన కథ.
ఓ నవల తరహాలో ఈ కథ రాశా. నవలను కూడా సినిమా స్క్రిప్ట్ స్ట్రక్చర్ లోనే రాశాను. కార్తి, అరవింద్ స్వామిలలో ఎవరు ఓకే చెప్పకపోయినా ఈ సినిమా తీసేవాడిని కాదు. వాళ్ళిద్దరే ఆ పెర్ఫార్మెన్స్ చేయగలరు. వాళ్ళ కెమిస్ట్రీ, కాంబినేషన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్. హీరో సూర్య గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీన్ని నిర్మించారు. టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ‘96’ సినిమాకి గోవింద వసంత్ ఎలాంటి సంగీతం ఇచ్చారో అంతే అద్భుతమైన మ్యూజిక్ దీనికి కూడా ఇచ్చారు. మ్యూజికల్ ట్రీట్‌లా ఉంటుంది. తెలుగు వెర్షన్ డబ్బింగ్ కూడా చాలా బాగా కుదిరింది. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది’ అని చెప్పాడు.