లక్ష్యం చేరుకునే వరకూ హద్దు ఉండకూడదు

లక్ష్యం చేరుకునే వరకూ హద్దు ఉండకూడదు

ఆశిష్‌‌ గాంధీ, అశోక్‌‌ హీరోలుగా వర్ష, హ్రితిక హీరోయిన్లుగా రాజశేఖర్ రావి దర్శకత్వం వహించిన  చిత్రం ‘హద్దు లేదురా’.  వీరేష్ గాజుల బళ్లారి నిర్మిస్తున్నారు. మార్చి 21న సినిమా విడుదల కానుంది.  ఆదివారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా బాగుంది. దర్శకుడు రాజశేఖర్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్లు అనిపించలేదు. మొదటి సినిమా బర్త్ లాంటింది. నా మొదటి సినిమా డాన్ శీను ఇప్పటికీ మర్చిపోలేను.  

మొదటి సినిమా కోసం ఫ్రెండ్షిప్ అనే మంచి పాయింట్ తీసుకున్నాడు.  టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్‌‌’ అని చెప్పాడు. ఆశిష్‌‌ గాంధీ మాట్లాడుతూ ‘ఇది ఫ్రెండ్షిప్ మూవీ. రాజశేఖర్ చాలా ప్యాషన్‌‌తో  సినిమా చేశారు. హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నాడు. దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ ‘జీవితాన్ని నచ్చినట్లు బ్రతకాలని చెబుతూ ఈ చిత్రానికి హద్దులేదురా అనే టైటిల్ పెట్టాం. లక్ష్యం చేరుకునే వరకూ హద్దు ఉండకూడదు’ అని అన్నాడు.  అవుట్‌‌పుట్ బాగా వచ్చిందని ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నా అని నిర్మాత అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తనికెళ్ళ భరణి,  రాధా మనోహర్ దాస్ సినిమా విజయం సాధించాలని కోరారు.