Director Saailu: ‘రాజు వెడ్స్ రాంబాయి’ భారీ సక్సెస్.. చిరుతో ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్ సాయిలు కంపాటి.

Director Saailu: ‘రాజు వెడ్స్ రాంబాయి’ భారీ సక్సెస్.. చిరుతో ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్ సాయిలు కంపాటి.

‘‘సాయిలు కంపాటి’’ (Saailu Kampati) .. ఇపుడు ఈ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మార్మోగుతుంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి రూటెడ్ లవ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు ఇతనే. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా నేటివ్ లవ్ స్టోరీని తీసుకుని, స్ట్రాంగ్ ఇంటెన్షన్‌‌‌‌తో సినిమా తీసి భారీ సక్సెస్ అందుకున్నాడు. నిజం చెప్పాలంటే.. సినిమా రిలీజ్కు ముందే తనదైన స్పీచ్తో అదరగొట్టాడు. ‘ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే, అమీర్ పేట సెంటర్లో కట్ డ్రాయర్ మీద తిరుగుతా’ అని మాట్లాడి తన కాన్ఫిడెంట్ ఏంటో నిరూపించారు.

ఇపుడు ఈ సినిమా రిలీజ్ అయ్యాక.. . ‘తన నైజాం ఏంటో.. తన మేకింగ్ ఏంటో.. తన క్యారెక్టర్ ఏంటో’ సినీ ఫ్యాన్స్కి మాత్రమే కాదు.. మొత్తం తెలుగు ఇండస్ట్రీ హీరోలకు, దర్శకులకు అర్ధమయ్యేలా చేశాడు. ఈ క్రమంలో వాస్తవిక కథలను తెరకెక్కించే దర్శకుల్లో ‘‘సాయిలు కంపాటి’’ ఉంటారని అభిప్రాయం వ్యక్తం అయ్యేలా చేశాడు. తమిళ స్టార్ డైరెక్టర్స్.. వెట్రిమారన్‌, మారి సెల్వరాజ్‌లతో.. "సాయిలు కంపాటి"ని పోల్చి చూస్తున్నారు. సో.. సక్సెస్ ఎలా అయిన రావొచ్చు.. ఎపుడైనా రావొచ్చు అనేలా సాయిలు ప్రూవ్ చేసుకున్నాడు. తాను నమ్ముకున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా సాయిలుకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది.

మెగా 158 లో చిరుతో ఛాన్స్:

లేటెస్ట్గా ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ సక్సెస్ ఈవెంట్ జరిగింది. ఈ సక్సెస్‌మీట్‌కు డైరెక్టర్ బాబీ కొల్లి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యి.. సాయిలుకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. సాయిలు సినిమా మేకింగ్ పై.. మాట్లాడిన స్పీచ్పై ప్రశంసలు అందించారు.

బాబీ మాట్లాడుతూ.. ‘ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో డైరెక్టర్ సాయిలు కంపాటి స్పీచ్ విని తనకు వణుకుపుట్టింది. నిజాయితీగా ఉండేవారు ఇలానే ఉంటారని అనిపించింది. ఈ క్రమంలో మూవీ చూశాక ఆ నమ్మకం మరింత పెరిగిందని’ అన్నారు. అలాగే ‘‘బోసు నేను ఈ స్టేజ్ మీద నుంచి అడుగుతున్నాను. నేను నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారితో చేయబోయే.. మెగా 158సినిమాలో నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలి తమ్ముడు’ అని బాబీ కోరారు. ఆ వెంటనే సాయిలు కంపాటి సంతోషం వ్యక్తం చేస్తూ నటించడానికి రెడీ అన్న అని ఒప్పుకున్నారు.

ఇకపోతే.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయిలు మాట్లాడుతూ.. ‘‘'నాదేదో చిన్న బతుకు. ఆ బతుకులో ఊర్లోకెళ్లి వచ్చి ఒక కథ రాసుకున్నా. మిమ్మల్ని హర్ట్ చేస్తే క్షమించండి. కానీ దయచేసి నెగిటివ్ ప్రచారం చేయకండి. 15 ఏళ్లు ఒక జంటకు నరకం చూపించిన కథను, ఆ మనుషుల్ని బయటకి తీసుకొచ్చి వాళ్ల కథ చెప్పాలని అనుకున్నా. మీకు నచ్చకపోతే లైట్ తీసుకోండి. కానీ నెగెటివ్ ప్రచారం చేయకండి.

ALSO READ :  నా డైరెక్షన్లో చిరంజీవితో కచ్చితంగా సినిమా చేస్తా

చిన్న సినిమా కానీ ఏదో ఒక పెద్ద ఎమోషన్ చెప్దాం అనుకున్నా. దయచేసి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయకండి. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే, అమీర్ పేట సెంటర్లో కట్ డ్రాయర్ మీద తిరుగుతా. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. నేను ఊరోడిని.. ఊరు కథలే రాస్తా. నాకు ఊరు ఎమోషన్ అంటే ఇష్టం. ఎందుకంటే నాకు ఇవే వచ్చు. నేను మీకోసం ఏదో కొత్త సినిమాలకి కొత్త కథలు రాయడానికి రాలేదు. ఒక కొత్త కథ చెప్పడానికి వచ్చా'' అని మాట్లాడి సోషల్ మీడియాను షేక్ చేశాడు సాయిలు.

‘రాజు వెడ్స్ రాంబాయి’ వసూళ్లు:

డైరెక్టర్, నిర్మాత వేణు ఊడుగుల నిర్మించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతోంది. 4 రోజుల్లోనే ఈ సినిమాకు 9.08 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.8కోట్లకి పైగా నెట్ సాధించి దూసుకెళ్తోంది. పెద్దగా హీరో, హీరోయిన్స్ లేరు.. డైరెక్టర్ ఎవరో కూడా తెలియదు.. కానీ, సినిమా కంటెంట్ మాత్రమే కింగ్ అని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించుకుంది. ప్రస్తుతం సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే.. ఇంకో 10 రోజులు బాక్సాఫీస్ ని శాసించే సత్తా కంటెంట్ కి ఉంది. ఏమవుతుందో చూడాలి!!!