అందుకే భీమ్లానాయక్ బ్లాక్ బస్టర్

అందుకే భీమ్లానాయక్ బ్లాక్ బస్టర్

అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాగర్‌‌‌‌ కె చంద్ర.. ‘భీమ్లానాయక్‌‌’తో మరిన్ని మార్కులు వేయించుకున్నాడు. ఈ సినిమాతో తన జర్నీ గురించి ఇలా చెప్పాడు.  ‘‘ఫస్ట్ లాక్‌‌డౌన్‌‌లో నిర్మాత నాగవంశీ కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. తర్వాత త్రివిక్రమ్ గారితో డిస్కషన్స్ జరిగాయి. రీమేక్ అనే ఆలోచనను మైండ్‌‌లో నుంచి తీసేసి, మన సినిమా రీమేక్ రైట్స్ మరొకరు తీసుకునేంతలా చేంజ్ చేద్దామన్నారాయన.  దాన్ని అచీవ్‌‌ చేశామనుకుంటున్నాం. అందుకే ఇది రీమేక్‌‌ కాదు.. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్‌‌’ లాంటి సినిమా అంతే. ఒరిజినల్‌‌లో బిజు మీనన్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌ పోలీసాఫీసర్‌‌‌‌గా చేశారు. పృథ్విరాజ్‌‌ లాంటి స్టార్ నెగిటివ్‌‌ రోల్ చేశారు. తెలుగులో పూర్తి డిఫరెంట్. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలా అనేదానిపై చాలా వర్క్ చేశాం. మలయాళంలో మూడు గంటల సినిమా. సెకెండాఫ్‌‌లో అరగంటసేపు ఒకే ఎమోషన్‌‌ను రిపీటెడ్‌‌ సీన్స్‌‌లా చూపించారు. దాన్ని ట్రిమ్‌‌ చేశాం. క్లైమాక్స్‌‌లో కూడా చేంజెస్‌‌ చేశాం. పవన్‌‌ కళ్యాణ్‌‌ గారి ఇమేజ్, కమర్షియల్‌‌ ఎలిమెంట్స్‌‌ మిస్సవకుండా తీశాం కనుకే బ్లాక్‌‌ బస్టర్‌‌‌‌ అయ్యింది. ఉన్నది ఉన్నట్టే తీసుంటే వర్కవుటయ్యేది కాదు. త్రివిక్రమ్‌‌ గారు లేకపోతే ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు. మామధ్య క్రియేటివ్‌‌ డిస్కషన్స్ వచ్చాయే కానీ డిఫరెన్సెస్‌‌ ఎప్పుడూ రాలేదు. మేకింగ్ విషయంలో ఎవరి వాటా ఎంత అంటే చెప్పడం కష్టం. కచ్చితంగా ఆయనది మేజర్ రోల్. నావంతు వర్క్ నేనూ చేశాను. హిందీ రిలీజ్ ప్లాన్స్ జరుగుతున్నాయి. దీని కంటే ముందు 14 రీల్స్ ప్లస్‌‌ బ్యానర్‌‌‌‌లో వరుణ్‌‌ తేజ్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేశారు. అనుకున్న దానికంటే బడ్జెట్‌‌ పెరగడంతో దాన్ని ఆపాం. ఇప్పుడు అదే కథతో చేస్తానా లేదా కొత్త కథతో చేస్తానా అనేది ఇంకా డిసైడవ్వలేదు. వేరే కథలు కూడా ఉన్నాయి. ఓ వారంలో క్లారిటీ వస్తుంది. అయితే కచ్చితంగా స్ట్రెయిట్ మూవీనే చేస్తాను.’’