
యాక్టర్,రైటర్,డైరెక్టర్ సముద్రఖని(Samuthirakani),లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటించిన BRO మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఇక తన డైరెక్షన్ మేకింగ్ కోసం ఒక సంవత్సరానికి పైగా బ్రో మూవీ కోసం అంకితం చేసిన తన యాక్టింగ్ ప్రపంచానికి.. మళ్ళీ తిరిగి జాయిన్ కాబోతున్నారు. సముద్రఖని ఫేమస్ యాక్టర్ కావడంతో.. వివిధ భాషల్లో డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక పలు ప్రాజెక్ట్స్ లకు సైన్ చేయదానికి రెడీ గా ఉన్నారు.
సముద్రఖని కెరీర్‌లో చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే,టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలలో తన క్యారెక్టర్స్ కోసం..తనని తాను మలుచుకోగలిగే టాలెంట్ ఉన్న యాక్టర్. తన క్రియేటివిటీ వల్ల డైరెక్టర్ గా, యాక్టర్ గా గుర్తింపుతో పాటు గౌరవాన్ని సంపాదించుకున్నారు. అంతే కాకుండా సౌత్ ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న క్యారెక్టర్ నటులలో ఒకరుగా సముద్రఖని తన సత్త చాటుతున్నారు. ప్రెసెంట్ సముద్రఖని కమలహాసన్(Kamal Hasan) ఇండియన్ 2, రామ్ చరణ్(Ramcharan) గేమ్ ఛేంజర్ మూవీలో కనిపించనున్నారు.
ALSO READ :మీకు నా ముద్దులు : ఇంగ్లీష్ హీరోయిన్ కు.. తెలుగు నేర్పిస్తున్న హిందీ హీరోయిన్..
సముద్రఖని 1998లో కే . విజయన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి, కె.బాలచందర్ 100వ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. రవితేజ(Ravi Teja) హీరోగా శంభో శివ శంభో,నాని(Nani) జెండా పై కపిరాజు,బ్రో మూవీస్ తో డైరెక్టర్ గా తెలుగులో మంచి గుర్తింపు పొందారు. అంతే కాకుండా అల్లు అర్జున్ హీరోగా 2020లో వచ్చిన అల వైకుంఠపురంలో సముద్రఖని యాక్టింగ్ కు సైమా ఉత్తమ ప్రతినాయకుడు గా అవార్డును సొంతం చేసుకున్నారు.