Prabhas Spirit: హార‌ర్ జోన‌ర్‌లో స్పిరిట్ మూవీ..డైరెక్టర్ సందీప్ వంగా క్లారిటీ

Prabhas Spirit: హార‌ర్ జోన‌ర్‌లో స్పిరిట్ మూవీ..డైరెక్టర్ సందీప్ వంగా క్లారిటీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సలార్ మూవీతో బాక్సాపీస్ హిట్ అందుకున్నారు. ఇక తన నుంచి రాబోయే సినిమాలు చూసుకుంటే..టాలెంటెడ్ డైరెక్టర్ కల్కి మూవీతో పాటు మారుతి డైరెక్షన్ లో ఒకటి, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ (Spirit) చేస్తున్నారు. లేటెస్ట్గా స్పిరిట్ మూవీ నుంచి చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

యానిమల్ ఇచ్చిన సక్సెస్తో వరుస ఇంటర్వ్యూలో బిజీగా ఉన్నారు డైరెక్టర్ సందీప్(Sandeep Reddy Vanga).తాజాగా ఓ బాలీవుడ్ మూవీ టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్ వంగా..స్పిరిట్లో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడో రివీల్ చేశాడు.'ఇప్పటికే స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని..ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్ ను చూడబోతున్నట్లు..తెలిపి ఫ్యాన్స్ లో జోష్ పెంచాడు.

అలాగే ఈ సినిమాలో ప్రభాస్ నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీసు క్యారెక్టర్లో నటిస్తున్నట్లు తెలిపారు. అంద‌రూ అనుకుంటున్న‌ట్లు స్పిరిట్ హార‌ర్ మూవీ కాద‌ని తెలిపాడు. అలాగే యానిమల్‌కు సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ ఉంటుందన్నారు'.

అయితే..స్పిరిట్ సినిమా ఎలా ఉండబోతుందో అనేది చాలా విధాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ అర్జున్ రెడ్డిలో చూపించిన డ్రగ్స్ కంటే 90% పవర్ ఫుల్ డ్రగ్స్ మాఫియా ఉండనుందని..అలాగే స్పిరిట్లో చాలా స్పెషల్ డ్రగ్స్..అంటే, భీకరమైన మత్తెక్కించే క్వాలిటీ డ్రగ్ తీసుకుంటే ఏ రేంజ్లో ఉంటుందో..ఇందులో చూపించబోతున్నట్లు సినీ సర్కిల్లో వినిపిస్తోంది. 

స్పిరిట్ మూవీని టీ-సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. యానిమల్ మూవీతో పాన్ ఇండియా లెవల్లో పేరు సంపాదించిన సందీప్ రెడ్డి వంగా.. స్పిరిట్తో మరో లెవల్కు వెళ్లడం మాత్రం కన్ఫమ్ అంటూ సినీ క్రిటిక్స్ చెబుతున్నారు.