Charan, Vijay: యూవీ ప్రాజెక్ట్ నుండి చరణ్ ఔట్.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన రౌడీ హీరో

Charan, Vijay: యూవీ ప్రాజెక్ట్ నుండి చరణ్ ఔట్.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన రౌడీ హీరో

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఆర్ఆర్ఆర్(RRR) లాంటో గ్లోబల్ హిట్టు తరువాత ఆయన సినిమాలపై క్రేజ్ బాగా పెరిగిపోయింది. అందుకే రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాల గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే.. స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్, బుచ్చిబాబు తో RC16, తరువాత సుకుమార్ తో సినిమా, నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయనున్నాడు. 

అయితే ఈ దర్శకులతో పాటు రామ్ చరణ్ మరో దర్శకుడితో కూడా సినిమా చేయాల్సి ఉంది. ఆ దర్శకుడు మరెవరో కాదు తమిళ దర్శకుడు నార్తన్. నిజానికి ఈ కాంబోలో సినిమా రానుందని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రముఖ నిర్మాన సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించానుందని, కథ చర్చలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే.. నార్తన్ కూడా రామ్ చరణ్ తో ఖచ్చితంగా సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. కానీ, ఆ ప్రాజెక్టు మాత్రం పట్టాలెక్కలేదు. 

ALSO READ :- నిమిషం కూడా సమయాన్ని వృధా చేయకుండా.. మోదీ పనిచేస్తున్నారు: ఖష్బూ

దాంతో దర్శకుడు నార్తన్ రూటు మార్చాడట. అదేంటంటే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Viay Devarakonda)తో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడట. ఇటీవల విజయ్ ని కలిసి కథ గురించి చర్చించాడట నార్తన్. పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేసిన ఈ కథ విజయ్ కి కూడా బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట. యూవీ క్రియేషన్స్ సంస్థనే ఈ సినిమా ప్రాజెక్టు చేయనున్నారని సమాచారం. అలా రామ్ చరణ్ చేయాల్సిన కథలోకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ వచ్చి చేరాడు. మరి రామ్ చరణ్ కథతో వస్తున్న విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.