Prabhas Spirit: మొదటిరోజు రూ.150 కోట్లు పక్కా.. స్పిరిట్ లెక్కలు చెప్పిన సందీప్ రెడ్డి

Prabhas Spirit: మొదటిరోజు రూ.150 కోట్లు పక్కా.. స్పిరిట్ లెక్కలు చెప్పిన సందీప్ రెడ్డి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా చేస్తున్న మూవీ స్పిరిట్(Spirit). వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. యానిమల్ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగా చేస్తున్న సినిమా కావడం, అది కూడా ప్రభాస్ హీరోగా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా గురించి చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. సినిమాపై అంచనాలను పెంచుతోంది. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన స్పిరిట్ సినిమా గురించి మాట్లాడుతూ.. స్పిరిట్ సినిమాలో చాలా కొత్త ప్రభాస్ ను చూస్తారు. ఈ సినిమాలో ప్రభాస్ రియాక్షన్ చూపించడానికి ట్రై చేస్తున్న. కమర్షియల్ సినిమాల్లా కాకుండా.. సినిమాలో తన వ్యక్తులకి, డ్యూటీగా గానే ఎవరైనా అడ్డం వస్తే ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఈ సినిమాలో హైలెట్ గా ఉంటుంది. ఇప్పటికే 60 శాతం కథ కంప్లీట్ అయ్యింది. డిసెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టాలి.

నిర్మాతలు స్పిరిట్ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రిలీజ్ కు ముందే సాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారానే రిటర్న్స్ వచ్చేస్తాయి. ఇక మొదటిరోజు ఈ సినిమా ఖచ్చితంగా రూ.150 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇది ఇవే కాన్ఫిడెన్స్ కాదు.. పక్కా లెక్కల ప్రకారం చెప్తున్నా.. అంటూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు సందీప్ రెడ్డి వంగ. ఈ వీడియో చుసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.