షాకిస్తున్న యానిమల్ రన్ టైమ్.. అన్ని గంటలు థియేటర్లో ఎవరుంటారు సామీ!

షాకిస్తున్న యానిమల్ రన్ టైమ్.. అన్ని గంటలు థియేటర్లో ఎవరుంటారు సామీ!

టాలీవుడ్ వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga) బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్(Animal). బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్(Ranbir kapoor) హీరోగా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రష్మిక మందన్న(Rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తున్నారు. టీజర్, అండ్ సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా రన్ టీమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం ఏకంగా అక్షరాల 3 గంటల 30 నిమిషాల రన్ టైమ్ సెట్ చేశాడట దర్శకుడు సందీప్. ఈ మధ్య కాలంలో ఇంత లెంగ్తీ రన్‌ టైమ్‌ తో సినిమా ఒక్కటి కూడా లేదు. నిజానికి 3 గంటల రన్ టైమ్ అంటే మాములు విషయం కాదు. అంత లెంగ్తీ రన్‌టైమ్‌తో ఆడియెన్స్‌ సినిమా థియేటర్‌లో కూర్చోవడం అంటే చాలా కష్టం అనే చెప్పాలి. 

అయితే.. బాలీవుడ్ మీడియా నుండి వినిపిస్తున్న సమాచారం మేరకు.. యానిమల్ అవుట్ పుట్ చాలా టెర్రిఫిక్ గా వచ్చిందట. సినిమాలో ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయట. సినిమా స్టార్ అయ్యాక కాన్సెప్ట్ కు కనెక్ట్ అయిన ఆడియన్ కు టైం అస్సలు గుర్తుడదని, కేవలం సినిమాతో అలా వెళ్ళిపోతూ ఉంటారని చెప్తున్నారు. మరి రిలీజ్ తరువాత ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో చూడాలి.