
తమిళ స్టార్ దళపతి విజయ్(Vijay talapathy) హీరోగా లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ లియో(Leo). అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. మొదటిరోజు ఏకంగా రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా పది రోజులకు గాను రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఓటీటీ లో రిలీజ్ కాబోతున్న సినిమా.. థియేటర్లలో విడుదలైన వెర్షన్ కి చాలా భిన్నంగా ఉండనుందట. ఇదే విషయాన్ని లియో దర్శకుడు లోకేష్ స్వయంగా చెప్పుకొచ్చాడు. లియో సినిమాలో ఇపుడున్న ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో దాదాపు 20 నిమిషాలు కేవలం ఫ్యాన్స్ కోసం చిత్రీకరించినవని, ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమా వెర్షన్ దీనికి చాలా భిన్నంగా ఉంటుందని లోకేష్ అన్నారు. అంతేకాదు.. క్లైమాక్స్ లో లియో ఆంటోనీ దాస్ కి చెప్పే వెర్షన్ కూడా కేవలం ఓటీటీ లో మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు.
దీంతో.. లియో సినిమాపై ఓటీటీ ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. సినిమాలో చేసిన ఆ మార్పులు ఏంటో తెలుసుకోవడానికి లియో ఓటీటీ రిలీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి థియేటర్ లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ను అందుకోనుందో చూడాలి.
Also Read :- హిందీలో రీమేక్ అవుతున్న బేబీ.. హీరోగా చేస్తున్న స్టార్ హీరో కొడుకు