శేఖర్ కమ్ముల షూట్ అయిపోయిందోచ్‌!

శేఖర్ కమ్ముల షూట్ అయిపోయిందోచ్‌!

అందమైన ప్రేమకథల్ని అంతే అందంగా, ఆహ్లాదంగా తెరపై ఆవిష్కరిస్తాడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ఆయన రూపొందిస్తున్న సినిమా ‘లవ్​ స్టోరీ’. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ మూవీ పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. కొన్ని రోజులుగా నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్ బుధవారం పూర్తయ్యింది. పాట చిత్రీకరణతో షూట్ కంప్లీట్ కావడంతో గుమ్మడికాయ కొట్టేశారు.

ఈ సందర్భాన్ని శేఖర్ కమ్ముల, సాయిపల్లవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు షూటింగ్ పూర్తయిన విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల సందడి మొదలవగానే సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కె.నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు ఈ చిత్రానికి నిర్మాతలు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రలు పోషించారు. సీహెచ్ పవన్ సంగీత దర్శకుడు.

Read more news

షుగర్ ఉంటే తేనె వాడొచ్చా..?

కళ్ల ముందే అద్భుతాలు.. త్వరలో అందుబాటులోకి ఏఆర్ టెక్నాలజీ

ఫ్లిప్ కార్ట్ యూజర్లు ఆల్ టైమ్ హై

కరోనా టెస్ట్.. జస్ట్ రూ.850

పేకాటలో టెక్నాలజీ.. తండ్రీ కొడుకుల ఛీటింగ్