
సెల్వ రాఘవన్(Selva Raghavan) దర్శకత్వంలో వచ్చిన 7జీ బృందావన్ కాలనీ’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ మూవీ వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా సీక్వెల్కు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మరోసారి రవికృష్ణ నటుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అనితగా ఆకట్టుకున్న సోనియా అగర్వాల్ స్థానంలో ఎవరు నటిస్తారనే సస్పెన్స్‌కు తాజాగా తెరపడింది.
ఈ సీక్వెల్లో అనశ్వర రాజన్( Anaswara Rajan) చాన్స్ కొట్టేసినట్టు టాక్. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ అందం.. పలు హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించింది. బాలీవుడ్లో యారియాన్2 లో అనశ్వర మెరిసింది. ఇటీవల త్రిషతో కలిసి రాంగీ లో నటించింది. ఈ అమ్మడి సోషల్ మీడియా ఫొటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ఈ మూవీ ఫ్యాన్స్అనిత దొరికేసిందంటూ కామెంట్స్పెడుతున్నారు. ఇక సెప్టెంబర్‌లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఈ మూవీలో ఫస్ట్ డైరెక్టర్ శంకర్ డాటర్ అదితి భవాని శంకర్, ఇవనా లతో మేకర్స్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరి ప్లేస్ లో అనశ్వర రాజన్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇక 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు 7G బృందావన్మూవీకి సీక్వెల్ రావడం విశేషం.