Nani, Sailesh: విలన్ వేటలో అర్జున్ సర్కార్.. రానా ఒప్పుకుంటాడా!

Nani, Sailesh: విలన్ వేటలో అర్జున్ సర్కార్.. రానా ఒప్పుకుంటాడా!

హిట్ సిరీస్ తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు దర్శకుడు శైలేష్ కొలను. ఆయన నుండి వచ్చిన రెండు హిట్, హిట్2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ రెండు సినిమాలు ఆడియన్స్ కు థ్రిల్ పంచాయి. మొత్తం ఏడు పార్టులుగా వస్తున్న ఈ సిరీస్ కు హీరో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అందుకే.. సిరీస్ లో నెక్స్ట్ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. 

ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాల్లో విశ్వక్ సేన్, అడివి శేష్ హీరోలుగా చేయగా.. రానున్న మూడో పార్ట్ లో నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో కనిపించనున్నాడని దర్శకుడు ఇప్పటికే చెప్పేశాడు. హిట్ పార్ట్ 2 ఎండింగ్ ను నాని అర్జున్ సర్కార్ గా ఎంట్రీ ఇస్తాడు. ఆ పాత్ర  ఎంట్రీతోనే జిత్ 2ను ఫినిష్ చేశారు శైలేష్. ఇక ఈ ఫ్రాంచైజీలోకి నాని ఎంట్రీ తరువాత హిట్ 3పై ఆటోమేటిక్ గా అంచనాలు పెరిగిపోయాయి.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు హిట్ 3కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేశాడట. ఇందులో బాగానే ప్రస్తుతం అర్జున్ సర్కార్ కోసం ఒక పవర్ఫుల్ విలన్ ను పట్టె పనిలో పడ్డాడట. అందుకోసం చాలా అప్షన్స్ చూస్తున్నాడట. అందులో హీరో రానా, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఉన్నారట. నిజంగా వీరిలో ఎవరు ఒప్పుకున్నా సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళ్లడం ఖాయం. అందుకే ఈసారి హిట్ సినిమాను పాన్ ఇండియా లెవల్ కు తీసుకెళ్లనున్నారట మేకర్స్. మరి వీరిలో ఎవరిని ఒకే చేస్తారో చూడాలి.