డైరెక్టర్ శంకర్ కుమార్తె పెళ్లి.. హాజరైన స్టాలిన్ తదితరులు

డైరెక్టర్ శంకర్ కుమార్తె పెళ్లి.. హాజరైన స్టాలిన్ తదితరులు

చెన్నై: పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కు ఆద్యుడు, ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ పెద్ద కమార్తె డాక్టర్ ఐశ్యర్య వివాహం ఆదివారం జరిగింది. కరోనా నిబంధనల కారణంగా ఆడంబరాలకు దూరంగా కొద్దిమంది ప్రముఖుల సమక్షంలో మహాబలిపురంలో జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. శంకర్ కుమార్తె డాక్టర్ ఐశ్వర్య తమిళనాడు క్రికెట్ లీగ్ క్రీడాకారుడు రోహిత్ దామోదరన్ తో పెళ్లి నిశ్చయించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడుతూ ఎట్టకేలకు ఇవాళ ముహూర్తం నిర్ణయించారు. 
క్రికెట్ క్రీడాకారుడైన రోహిత్ దామోదరన్ తండ్రి చెన్నైలో ప్రముఖ వ్యాపారవేత్త. ఐపీఎల్ క్రీడకు మంచి ఆదరణ లభించడంతో ఆయన మధురై పాంతర్స్ క్రికెట్ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇరువురి ఆప్తుల సమక్షంలో మహాబలిపురంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. పెళ్లి అనంతరం వధూవరులు ప్రముఖులతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.