Sujeeth with OG: ఓజీతో సుజీత్.. పూనకాలు తెప్పిస్తున్న డైరెక్టర్ ప్రొఫైల్ పిక్

Sujeeth with OG: ఓజీతో సుజీత్.. పూనకాలు తెప్పిస్తున్న డైరెక్టర్ ప్రొఫైల్ పిక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ(OG). యంగ్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇండియా వైడ్ గా ఏ సినిమాకు లేనంత క్రేజ్ ఓజీ సినిమాకు క్రియేట్ అవుతోంది. కారణం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి గ్యాగ్ స్టార్ గా కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాను సంబందించిన చిన్న న్యూస్ అయినా నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే రిలీజైన ఓజీ టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెల్సిందే. 

ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ లుక్, ఆయన చెప్పున డైలాగ్స్, థమన్ బీజీఎమ్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ చొక్కాలు చుంచుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. ఓజీ రిలీజ్ అయ్యాక ఒక్క రికార్డ్ కూడా మిగలవని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు క్రియేట్ అవుతున్న హైప్ చూస్తుంటే అది నిజమేనని క్లియర్ గా అర్థమవుతోంది. 

ఇక ఓజీ సినిమా దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అన్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ ని మార్చారు. ఈ పిక్ లో పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్ భుజంపై చేయివేసి ఎదో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఈ క్రేజీ పిక్ ని తన ఇన్స్టా ప్రొఫైల్ గా పెట్టుకున్నాడు సుజీత్. దీంతో ఈ పిక్ కాస్త ట్రేండింగ్ లోకి వచ్చేసింది. ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కేవలం పిక్ తోనే ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తున్నారంటే.. రేపు సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండటం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read : Rashmika Mandanna: అరుదైన గౌరవం దక్కించుకున్న రష్మిక.. విజయ్ దేవరకొండ పోస్ట్ వైరల్