Sukumar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2: ది రూల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఫ్యాన్ ఇండియా భాషలలో డిసెంబర్ 05న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. రెండు రోజుల్లోనే రూ.449 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో శుక్రవారం పుష్ప 2 చిత్ర యూనిట్ సక్సస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ పుష్ప2 సినిమా ఇంతపెద్ద హిట్ అయినందుకు, అలాగే ఈ సినిమాకోసం కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికి థాంక్స్ తెలిపాడు. అయితే పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటన గురించి మాట్లడుతూ మెమోషనల్ అయ్యాడు. ఇందులోభాగంగా పుష్ప సినిమా ఇంత గ్రాండ్ సక్సస్ అయినప్పటికీ గత రెండుమూడు రోజుల నుంచి ఏమాత్రం సంతోషంగా లేనని అన్నాడు. ఈ క్రమంలో 3 ఏళ్ళు, 6 ఏళ్ళు మేం కష్టపడి సినిమా తీయగలం కానీ ప్రాణాన్ని క్రియేట్ చేయలేమని అంటూ ఎమోషనల్ అయ్యాడు.
Also Read :- థాంక్స్ కళ్యాణ్ బాబాయ్ అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్
ఏం చేసినా పోయిన ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేమని కానీ మృతురాలి కుటుంబానికి అండగా నిలిచి అన్నివిధాలా సహాయం అందిస్తామని తెలిపాడు. మేం కష్టపడి సినిమాలు తీసేది ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చెయ్యడానికేనని అలాంటిది సినిమా చూసే క్రమంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని అన్నాడు. కాబట్టి సినిమా చూడటానికి వెళ్లొచ్చే క్రమంలో జాగ్రత్తగా ఉంటూ క్షేమంగా ఇంటికి చేరాలని సూచించాడు.
ఈ విషయం ఇలా ఉండగా బుధవారం రాత్రి పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సినిమా చూసేందుకు హైదరాబాద్ కి చెందిన భాస్కర్ అనే వ్యక్తి భార్య పిల్లలతో కలసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ కి వచ్చాడు. అయితే ఇదే థియేటర్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో వచ్చాడు. దీంతో అభిమానులు భారీ ఎత్తున వచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగ్గా రేవతి అనే మహిళ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పో