1920లో జరిగే పాన్ ఇండియా పీరియాడిక్ కథతో రానున్న తేజ, రానా మూవీ

1920లో జరిగే పాన్ ఇండియా పీరియాడిక్ కథతో రానున్న తేజ, రానా మూవీ

దర్శకుడు తేజ(Teja), టాలీవుడ్ హల్క్ రానా(Rana) కాంబోలో మరో మూవీ రానుంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో నేనే రాజు నేనే మంత్రి(Nene raju nene mantri) అనే సినిమా వచ్చింది. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. చాలా కాలంగా సరైన హిట్టు కోసం చూస్తున్న ఈ ఇద్దరికీ నేనే రాజు.. నేనే మంత్రి సినిమాతో సూపర్ హిట్ పడింది. మళ్ళీ ఈ సినిమా తరువాత ఈ ఇద్దరికీ సరైన హిట్టు పడలేదు. 

అందుకే ఈ కాంబో మరో సినిమా కోసం జతకట్టారు. దీనికి సంబందించిన న్యూస్ ఒకటి ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కెరీర్ లో మొదటిసారి దర్శకుడు తేజ పాన్ ఇండియా ప్రాజెక్టు ను చేయనున్నారు. ఇందుకోసం 1920లో జరిగే పీరియాడికల్ కథను ఎంచుకున్నారని సమాచారం. రూరల్ బ్యాక్డ్రాప్ లో ఆంధ్రా, మద్రాస్ బోర్డర్స్ లో ఈ కథ సాగనుందట. లైఫ్ పీరియడ్ ఎడ్వెంచర్ ఎపిసోడ్స్, యాక్షన్, రొమాన్స్ ప్రధానంగా సాగనున్న ఈ సినిమాను గోపీనాథ్‌ ఆచంట నిర్మించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.