ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌‌‌‌లో పౌరాణిక మూవీకి ప్లాన్ ..!

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌‌‌‌లో పౌరాణిక  మూవీకి ప్లాన్ ..!

ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ ఎంత గొప్పగా ఉంటుందో చూశాం. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ రాసే డైలాగ్స్ ఎంత గొప్పగా ఉంటాయో తెలిసిందే. ‘అరవింద సమేత’ చిత్రంలో వీరిద్దరి టాలెంట్స్ ఒకదానిని మించి మరొకటి పోటీ పడటం చూశాం. ఇద్దరి కాంబినేషన్‌‌‌‌లో మరో సినిమా రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలతో అది క్యాన్సిల్ అయింది. అయితే త్వరలోనే మరోసారి ఈ క్రేజీ కాంబోలో సినిమా రాబోతోంది. ఇందుకు సంబంధించి ఓ మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది. నిర్మాత నాగవంశీ ఈ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌‌‌‌లో ఓ భారీ పౌరాణిక చిత్రానికి ప్లాన్ చేస్తున్నామని, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ ఇప్పటికే ఓకే చెప్పిన రెండు సినిమాలు, త్రివిక్రమ్‌‌కి ఉన్న రెండు కమిట్మెంట్స్ పూర్తయ్యాక ఇది ఉండబోతోందని కూడా క్లారిటీ ఇచ్చారు నాగవంశీ. పేజీల కొద్దీ పౌరాణిక డైలాగులను ఎన్టీఆర్ చకాచకా చెప్పేయగలడని ‘యమదొంగ’ లాంటి చిత్రాల్లో చూశాం. ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ నటించబోయే పూర్తిస్థాయి పౌరాణిక చిత్రం మాత్రం ఇదే అవనుంది. అలాగే త్రివిక్రమ్‌‌‌‌కు కూడా ఇదే ఫస్ట్ మైథాలజీ మూవీ. మరి ఈ ఇద్దరూ కలిసి చేయబోయే ఈ పౌరాణిక చిత్రం కోసం రామాయణ, భారతాల్లోని ఏ కథను ఎంచుకుంటారో అనే ఆసక్తి నెలకొంది.