గణేష్ విగ్రహం చుట్టూ జరిగే కథ ఇది

గణేష్ విగ్రహం చుట్టూ జరిగే కథ ఇది

ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి తెరకెక్కించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు.  శుక్రవారం సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు ఉదయ్ శెట్టి మాట్లాడుతూ ‘గణేష్ విగ్రహం చుట్టూ జరిగే కథ ఇది. సినిమాలో చాలా గ్రే క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్లంతా విగ్రహం కోసం ప్రయత్నిస్తుంటారు. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, కర్నూల్ నేపథ్యంలో జరిగే కథ. మరో రెండేళ్ల తర్వాత ఈ సినిమా వచ్చినా కొత్తగా ఉంటుంది. అలాంటి స్క్రీన్‌‌‌‌‌‌‌‌ ప్లే కుదిరింది. ట్విస్ట్స్ అండ్ టర్న్స్‌‌‌‌‌‌‌‌ను హోల్డ్ చేస్తూ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ ప్లే సాగుతుంది. గత చిత్రాలకు భిన్నంగా ఇందులో  గ్రే షేడ్స్‌‌‌‌‌‌‌‌ ఉండే పాత్రలో ఆనంద్ నటించాడు. చాలా ఎనర్జిటిక్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తాడు. డైలాగ్ డెలివరీ, టైమింగ్, రియాక్షన్స్ అన్నీ చాలా బాగా చేశాడు. రాజమౌళి గారి సినిమాల్లోని డ్రామా నాకిష్టం. అలాంటి ఓ యాక్షన్ డ్రామాని నా నెక్స్ట్ మూవీగా చేయబోతున్నాను’ అని చెప్పాడు.