
పొలిటీషియన్స్, ప్లేయర్స్, సినీ స్టార్స్‌పై బయోపిక్స్ ఎన్నో చూశాం. కానీ వాటికి భిన్నంగా స్టూవర్ట్‌పురం గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథను సినిమాగా రూపొందించాడు దర్శకుడు వంశీ. రవితేజ టైటిల్ రోల్‌లో నటించగా, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. అక్టోబర్ 20న సినిమా విడుదలవుతున్న సందర్భంగా వంశీ మాట్లాడుతూ ‘‘టైగర్ నాగేశ్వరరావు’ కథ గురించి దాదాపు రెండేళ్ళు రీసెర్చ్ చేశాక ఆశ్చర్యపరిచే చాలా విషయాలు తెలిశాయి. మనకి తెలిసినంతవరకూ అతను ఒక దొంగ. అయితే తన ఇన్నర్ సోల్ ఏమిటో ఎవరికీ తెలీదు. దాన్ని సినిమాగా చూపించాలనిపించింది.
ఆయనలో రెండు షేడ్స్ ఉన్నాయి. ఒక షేడ్‌లో భయంకరమైన దొంగ. మరో కోణంలో చాలా మనసున్న మనిషి. ఆయన గురించి ప్రచారంలో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. రవితేజ గారు కథ విని ఒప్పుకోవడం నాకు ఎమోషనల్ మూమెంట్. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ట్రైన్ సీక్వెన్స్, చెన్నైలో పోర్ట్ సీక్వెన్స్, జైలు నుంచి తప్పించుకునే సీక్వెన్స్.. ఇలా చాలా వండర్ ఫుల్ సీన్స్ ఇందులో ఉన్నాయి. నిర్మాత అభిషేక్ గారు నాపై ఉంచిన నమ్మకంతో సినిమా చాలా గ్రాండ్‌గా వచ్చింది’ అని చెప్పాడు.