సుకుమార్, వివేక్ అగ్నిహోత్రి కాంబినేషన్ లో మూవీ?

సుకుమార్, వివేక్ అగ్నిహోత్రి కాంబినేషన్ లో మూవీ?

రంగస్థలం, పుష్ప లాంటి కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అయిన టాలీవుడ్ డైరెక్టర్ ఒకరు. ‘ద కశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ లాంటి సంచలన చిత్రాలతో మెప్పించిన బాలీవుడ్ డైరెక్టర్ మరొకరు. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి వరుస విజయాలతో దూసుకెళ్తోన్న నిర్మాత ఇంకొకరు. ఈ ముగ్గురూ కలిసి పనిచేయబోతున్నారు. ఇటీవల కొత్త ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి దర్శకులు సుకుమార్, వివేక్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి చర్చించారు.

ఇందుకు సంబంధించిన ఫోటోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ సినిమా ఏంటి, ఇద్దరు దర్శకుల్లో ఎవరు డైరెక్ట్ చేస్తారు లాంటి వివరాలేవీ వెల్లడించలేదు. ముగ్గురూ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఫిల్మ్ మేకర్స్ కావడంతో, కచ్చితంగా వీళ్ల నుండి ఓ సెన్సేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీ రానుందనే అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ‘ద కశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ తర్వాత అభిషేక్ నిర్మాణంలో వివేక్ అగ్నిహోత్రి మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. ఈలోగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.