ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఛార్జీల పెంపు: ఈఆర్సీ ఛైర్మన్

ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఛార్జీల పెంపు: ఈఆర్సీ ఛైర్మన్

విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కమ్స్, ఈఆర్సీకి సమర్పించాయి. ప్రస్తుత టారిఫ్ నే కంటిన్యూ చేయాలని డిస్కంలు ప్రతిపాదించినట్లు ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఛార్జీల పెంపు నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. రూల్స్ ప్రకారం డిస్కంలు 30 పైసలు పెంచుకునే అవకాశం ఉందన్నారు. 50 పైసలకు మించి పెంచాలనుకుంటే మాత్రం ఈఆర్సీ పర్మిషన్ కావాలని శ్రీరంగారావు చెప్పారు. ఇక అగ్రికల్చర్ డీటీఆర్ ల దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పామన్నారు. మీటర్లు పెట్టకపోతే చర్యలు తప్పవని ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు హెచ్చరించారు.

ఈ వివరాలన్నీ వెబ్ సైట్ లో అందుబాటులో పెడతామన్న శ్రీరంగారావు.. డిస్కమ్స్ ప్రతిపాదనలపై బహిరంగ విచారణ ద్వారా  అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. పబ్లిక్ సమావేశాల తర్వాత ఛార్జీలు పెంచాలా? తగ్గించాలా? అనేది త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 500 యూనిట్లు వినియోగించే వినియోగదరులకు ప్రీ పెయిడ్ మీటర్స్ పెట్టుకోవాలని సుచించామని చెప్పారు. ఇప్పటి వరకు డిస్కమ్స్ వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయన్నారు. రెండు డిస్కమ్స్ రూ.10,535 కోట్ల రెవెన్యూ లోటులో ఉన్నాయని, 10,316 మిలియన్ యూనిట్ల లోటులో డిస్కమ్స్ ఉన్నాయని తెలిపారు.