పెండింగ్ చలాన్లు నవంబర్ 30లోపు వరకే అర్హత

పెండింగ్ చలాన్లు నవంబర్ 30లోపు వరకే అర్హత

పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌‌ కోసం తెలంగాణప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. బైక్​లు, ఆటోలపై ఉన్న పెండింగ్ చలాన్లకు 80 శాతం,  ఆర్టీసీ బస్సులకు 90 శాతం, కార్లు,హెవీ మోటార్‌‌‌‌ వెహికల్స్‌‌కు 60 శాతం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.   డిస్కౌంట్‌ ఆఫర్ జనవరి10వ తేదీ వరకు అమలు చేసే అవకాశం ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.  

అయితే చలాన్‌లపై తగ్గింపు అన్ని రకాల వాహనాలకు వర్తించినప్పటికీ ఈ ఏడాది  నవంబర్ 30లోపు పడిన చలాన్లుకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది.  ఈ మేరకు ఓ నెటిజన్  తనకు డిస్కౌంట్ రాలేదంటూ  స్ర్కీన్ షాట్ తో  హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కు ట్విట్టర్ లో ప్రశ్నించగా వారు ఈ విధంగా  సమాధానం ఇచ్చారు.  

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాహనాలపై పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసేంత వరకు ఈ ఆఫర్ ను  కొనసాగించే యోచనలో పోలీసులు ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటికే 47,25,089 ట్రాఫిక్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో అత్యధికంగా 18,33,761 హెల్మెట్‌ వాడని చలాన్స్‌ ఉన్నాయి. డిస్కౌంట్ ఆఫర్ అమల్లోకి వస్తే ఈసారి పెండిగ్ చలాన్స్ పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం ఉందని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.