దాదాపు అన్ని ఏరియాల్లో నుంచి సైనికులు వెనక్కి వచ్చారు: చైనా

దాదాపు అన్ని ఏరియాల్లో నుంచి సైనికులు వెనక్కి వచ్చారు: చైనా
  • ప్రకటించిన చైనా ఫారెన్‌ మినిస్టర్‌‌

బీజింగ్‌: ఇండియా – చైనా బోర్డర్‌‌లోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి సైనికులు వెనక్కి వెళ్లిపోయారని చైనా ప్రకటించింది. మిగతా ఇష్యూల గురించి త్వరలోనే చర్చలు జరుపుతామని చైనా ఫారెన్‌ మినిస్టర్‌‌ మంగళవారం ప్రకటించారు. గత శుక్రవారం మూడు గంటల పాటు జరిగిన మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. “ ఇండియా, చైనా ఈ మధ్యే మిలటరీ అండ్‌ డిప్లమాటిక్‌ చానల్స్‌ ద్వారా ఇంటెన్సివ్‌గా కమ్యూనికేట్‌ అయ్యాం. మూడు మీటింగ్స్‌లో నాలుగు రౌండ్ల సమావేశాలు నిర్వహించాం. బోర్డర్‌‌లో పరిస్థితి మరింత మెరుగుపడుతోంది. ఫ్రంట్‌లైన్‌ బోర్డర్‌‌ ట్రూప్స్‌ అన్నీంటినీ వెనక్కి తీసుకున్నాం. ఇప్పుడు ఐదో రౌండ్‌ కమాండర్‌‌ లెవెల్‌ చర్చల కోసం సన్నద్ధం అవుతున్నాం” అని చైనా ఫారెన్‌ మినిస్టర్‌‌ అధికార ప్రతినిధి చెప్పారు.