
న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌లోని అన్ని ప్రాంతాల నుంచి సైనికులు వెనక్కి వచ్చేశారని చైనా అధికారులు చెప్పగా అది నిజం కాదని మన అధికారులు చెప్పారు. చైనా బుకాయిస్తుందని, సైనికులు ఇంకా బోర్డర్ నుంచి వెళ్లిపోలేదని చెప్పారు. “ ఈ ప్రక్రియలో కొంచెం ప్రోగ్రెస్ వచ్చింది. కానీ మొత్తం పూర్తి కాలేదు. దీనిపై చర్చించేందుకు ఇరు దేశాల సీనియర్ కమాండర్స్ సమావేశం అవుతారు” అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవా చెప్పారు. బోర్డర్‌లో శాంతి నెలకొల్పేందుకు చైనా పూర్తిగా సహకరిస్తుందని, దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. బోర్డర్‌లోని అన్ని ఏరియాల్లో తమ సైన్యం వెనక్కి వెళ్లిపోయిందని, చైనా అధికారులు చేపిన నేపథ్యంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.