న్యూఢిల్లీ: వాల్ట్ డిస్నీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు భారతదేశంలో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేయడానికి బైండింగ్ అగ్రిమెంట్‌పై సంతకం చేశాయి . ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విలీన సంస్థలో 61శాతం వాటా ఉంటుంది. ఇందుకోసం అది రూ.10 వేల కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనుంది.
డిస్నీకి మైనారిటీ వాటా ఉన్న డీటీహెచ్ కంపెనీ టాటా ప్లే లిమిటెడ్‌ను కొనుగోలు చేయడం గురించి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆలోచిస్తోంది. ప్రస్తుతం, టాటా సన్స్‌కు టాటా ప్లేలో 50.2శాతం వాటా ఉంది. మిగిలిన షేర్లు సింగపూర్‌లోని ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అయిన డిస్నీ టెమాసెక్ వద్ద ఉన్నాయి. విలీనం పూర్తయితే అత్యంత శక్తివంతమైన మీడియా సంస్థ ఏర్పాటవుతుందని ఎక్స్పర్టులు చెబుతున్నారు.
