Disney Layoffs : 7000 మంది ఉద్యోగుల తొలగింపు

Disney Layoffs : 7000 మంది ఉద్యోగుల తొలగింపు

ఎంటర్టైన్మెంట్ జెయింట్ డిస్నీ సైతం ఉద్యోగులను తొలగించే పనిలో పడింది. తాజాగా 7వేల మందికి పింక్ స్లిప్పులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. డిస్నీ తాజా నిర్ణయం మొత్తం ఉద్యోగుల్లో 3.6 శాతం మందిపై ప్రభావం చూపననుంది. డిస్నీ ప్లస్‭ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది డిసెంబర్‌ 31 నాటికి సబ్ స్కైబర్ల సంఖ్య 1 శాతం తగ్గి 168.1 మిలియన్లకు పడిపోయింది. దీంతో కాస్ట్‌ కటింగ్‌పై దృష్టి పెట్టిన యాజమాన్యం.. 7వేల మందిని తొలగించేందుకు సిద్ధమైంది. 2021 వార్షిక నివేదిక ప్రకారం.. ఆ ఏడాది నవంబర్ నాటికి డిస్నీ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 1.90 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. వీరిలో 80 శాతం మంది పర్మినెంట్ ఎంప్లాయిస్ ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలను ఆర్థికమాంద్య భయాలు వెంటాడుతున్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను  చుకుంటున్నాయి. లేఆఫ్స్‌ బాట పట్టిన యూఎస్‌ టెక్‌ కంపెనీల సరసన డిస్నీ నిలిచింది. అయితే ఉద్యోగులను తొలగించే నిర్ణయం అంత తేలిగ్గా తీసుకోలేదని సీఈవో బాబ్ ఇగర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అంకిత భావంతో పనిచేస్తున్న ప్రతిభావంతులైన తమ ఉద్యోగులపై గౌరవం, అభిమానం ఉన్నాయని తెలిపారు.