భోళా శంకర్ సినిమా నిర్మాతలపై క్రిమినల్ కేసు.. వీళ్లు చేసిన నేరం ఏంటీ..?

భోళా శంకర్ సినిమా నిర్మాతలపై క్రిమినల్ కేసు.. వీళ్లు చేసిన నేరం ఏంటీ..?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) భోళా శంకర్(Bholaa Shankar) సినిమా రిలీజ్ నిలిపివేయాలంటూ..గతంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సతీష్ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే విషయంపై మరోసారి డిస్ట్రిబ్యూటర్ సతీష్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే..అఖిల్ హీరోగా నటించిన  ఏజెంట్ సినిమాను గాయత్రి ఫిలిం యాజమాని డిస్ట్రిబ్యూటర్..బత్తుల సత్యనారాయణ (సతీష్)(Battula Satyanarayana) భారీ ధరకి కొనుగోలు చేశారు. కానీ విడుదల తర్వాత చాలా నష్టం ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన సామజవరగమన మూవీ హక్కులను సైతం సతీష్కి ఇవ్వగా..హిట్ అయ్యింది. కానీ, ఏజెంట్ మూవీకి రావలసిన డబ్బులను ఇంత వరకి చెల్లించలేదు.

ఇవాళ (సెప్టెంబర్ 16న) హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో డిస్ట్రిబ్యూటర్ సతీష్ మాట్లాడుతూ.. ఏజెంట్ మూవీని..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి మూడు రాష్ట్రాల హక్కుల కోసం 30 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ను బ్యాంకు ద్వారా తాను చెల్లించడం జరిగిందని, అయితే తనకు కేవలం విశాఖపట్నం వరకే తనకు హక్కులను ఇచ్చారని.. వైజాగ్ సతీష్ వెల్లడించారు.

దీంతో డిస్ట్రిబ్యూటర్ సతీష్..భోళా శంకర్ సినిమా నిర్మాతలపై కోర్టులో తేల్చుకోవటానికి సిద్దపడగా..హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు చీటింగ్ కేసు తో పాటు వివిధ కేసులు నమోదుచేసింది.
అంతే కాకుండా.. భోళా శంకర్ మూవీ రిలీజ్ టైంలో కూడా సతీష్ కోర్టును ఆశ్రయించగా..ఇండస్ట్రీ పెద్దలతో సంప్రదింపులు జరిపి..తన డబ్బులు తిరిగి చెల్లిస్తామని అండర్ స్టాండింగ్ లెటర్ ఇచ్చారని సతీష్ వివరించారు. గత పదమూడేళ్లుగా వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న సతీష్ రంగస్థలం వంటి అనేక పెద్ద సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ చేసిన అనుభవం ఉంది. కనుకే..తనకు సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధం వల్ల ఇంతవరకు రావలసిన డబ్బుల విషయంలో ఆచితూచి వ్యవహరించానని తెలిపారు. అందుకు భోళా శంకర్ ప్రొడ్యూసర్స్ సతీష్ ని పట్టించుకోట్లేదని,కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదని, దాంతో తన డబ్బుల రికవరీ కోసం కోర్టును ఆశ్రయించడం జరిగిందని వెల్లడించారు. 

అందుకుగాను న్యాయపోరాటం చేయడానికి కోర్టుకు వెళ్లగా..డిస్ట్రిబ్యూటర్ సతీష్ చెల్లించిన 30 కోట్ల రూపాయల డబ్బును రికవరీ చేసుకునేందుకు సూట్ ఫైల్ చేసుకోమని హైదరాబాద్ సివిల్ కోర్టు పర్మిషన్ ఇచ్చిందని పేర్కొన్నారు. అందుకు గాను మరోవైపు నాంపల్లి క్రిమినల్ కోర్టులో భోళా శంకర్ నిర్మాతలపై..వివిధ సెక్షన్స్ కింద క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయ్యాయని ప్రెస్ మీట్ లో వెల్లడించారు. 

డిస్ట్రిబ్యూటర్ సతీష్ తరుపు అడ్వకేట్ కేశాపురం సుధాకర్ మాట్లాడుతూ..బత్తుల సత్యనారాయణ (సతీష్) ను మోసం చేసిన వారిపై న్యాయస్థానంలో సివిల్ కేసులకు సంబందించిన వాదనలు కొనసాగుతున్నాయని అన్నారు. న్యాయం సతీష్ పక్షాన ఉన్నందున తాము తప్పకుండా గెలుస్తామని, ఆ మేరకు సదరు నిర్మాతలపై రికవరీ సూట్ ఫైల్ చేసుకోమని కోర్టు చెప్పిందని ఆయన తెలిపారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో సతీష్ ను మోసం చేసిన భోళా శంకర్ నిర్మాతలు  అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, ఇంకా వారి సంస్థకు చెందిన గరికపాటి కిషోర్ పై కుట్ర, చీటింగ్, నమ్మకద్రోహం, వంటి వివిధ సెక్షన్స్ కింద కేసులు రిజిస్టర్ అయ్యాయని ఆయన తెలిపారు.