డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ కార్డ్స్ అందించిన మంత్రి హరీష్

డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ కార్డ్స్ అందించిన మంత్రి హరీష్

డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ కార్డ్స్ ను మంత్రి హరీష్ రావు అందించారు . రాష్ట్రంలో 12 వేల మంది డయాలసిస్ రోగులు ఉన్నారని చెప్పారు. వీరికి ఏడాదికి 100 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అయిన వారికి లైఫ్ లాంగ్ మెడిసిన్ ఫ్రీగా ఇస్తున్నామన్నారు. బీపీ,షుగర్ ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రతి 100లో 20 మందికి బీపీ,షుగర్ లు ఉన్నాయని, అందుకే హెల్త్ ప్రొఫైల్ చేస్తున్నామని తెలిపారు. 

వెంగల్ రావు నగర్ లో టెలీ సర్వీస్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మెంటల్ హెల్త్ తో సఫర్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఒత్తిడి తగ్గితే ఆత్మహత్యలు తగ్గుతాయన్నారు.  24 గంటల సర్వీస్ ఇస్తున్నామని.. టోల్ ఫ్రీ నెంబర్ 14416 ను వినియోగించుకోవాలన్నారు. సెలవు దినాల్లో కూడా ఇది పనిచేస్తుందని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.