ఖానాపూర్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఖానాపూర్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఖానాపూర్, వెలుగు :  లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు శుక్రవారం ఖానాపూర్​పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితులకు చెక్కులు అందజేశారు.

కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు సత్యం, రాజేందర్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దొనికేని దయానంద్, నిమ్మల రమేశ్, నాయకులు గంగ నర్సయ్య, షోఖాత్ పాషా, సాగర్, రాజన్న, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.