
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని అయిదుగురు ట్రాన్స్ జెండర్ లకు జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ఐడెంటిటీ కార్డులను అందించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక పునరావాస పథకాలకు ఈ ఐడెంటిటీ కార్డులున్న ట్రాన్స్ జెండర్లు అర్హులవుతారని కలెక్టర్ తెలిపారు. ట్రాన్స్ జెండర్ల పట్ల వివక్ష లేకుండా చూడాలని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను అమలు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో ఉన్న మిగతా ట్రాన్స్ జెండర్ లందరూ ఐడెంటిటీ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.