నిజామాబాద్ జిల్లాలో పీడీఎస్యూ మహాసభను విజయవంతం చేయాలి : కర్క గణేశ్

నిజామాబాద్ జిల్లాలో పీడీఎస్యూ మహాసభను విజయవంతం చేయాలి : కర్క గణేశ్

బోధన్, వెలుగు : నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఈనెల 25న జరిగే 23వ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని పీడీఎస్​యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేశ్​ పిలుపునిచ్చారు. ఆదివారం బోధన్ పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీ న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ హైదరాబాద్ చేగువేరా కామ్రెడ్ జార్జిరెడ్డి అమరత్వంతో, పీడీఎస్​యూ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పుట్టిన గడ్డమీద సభ నిర్వహిస్తున్నామన్నారు.  జంపాలా చంద్రశేఖర్ ప్రసాద్ ప్రాంగణం (రాజీవ్ గాంధీ ఆడిటోరియం)లో బహిరంగ సభ, పాత కలెక్టరేట్ నుంచి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు విద్యార్థి ప్రదర్శన ఉంటుందన్నారు.  

పీడీఎస్​యూ  జిల్లా మహాసభకు పాశం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్, కాంపాటి పృథ్వీ, ఎస్. అనిల్, పీడీఎస్​యూ  రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వస్తున్నారని తెలిపారు.  గత ప్రభుత్వం నుంచి నేటి ప్రభుత్వం వరకు ప్రభుత్వ విద్య సమస్యలతో కొట్టుమిట్టాడుతుందన్నారు. అందరికీ కామన్ విద్య అందించాలన్నారు. ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్​ చేశారు. విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో సభకు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్ యూ  జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే అషూర్, జిల్లా నాయకులు ఆర్.వినోద్, రెహాన్, గణేశ్,కార్తీక్, శివ,కార్తీక్ పాల్గొన్నారు.