- జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
ఖిలా వరంగల్ (మామునూ రు), వెలుగు: జనగణన ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.ఆదివారం బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో జనగణన-2027 నిర్వహణపై సెన్సెస్ క్లర్కులు , టెక్నికల్ అసిస్టెంట్లకు శిక్షణ నిర్వహించారు. జనగణన ప్రక్రియపై పూర్తి అవగాహనతో బాధ్యతగా విధులు నిర్వహించాలని అన్నారు.
ప్రభుత్వానికి అవసరమైన ఖచ్చితమైన గణాంకాలు అందుతాయని, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా సెన్సస్ అధికారి (డీఆర్ఓ) విజయలక్ష్మి, ముఖ్య ప్రణాళిక అధికారి చంద్రకళ, వరంగల్ ఆర్డీఓ సుమ, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు.
