అనంతగిరి గుట్టలో 213 ఎకరాల్లో ఎకో టూరిజం : నారాయణ రెడ్డి

అనంతగిరి గుట్టలో 213 ఎకరాల్లో ఎకో టూరిజం : నారాయణ రెడ్డి

వికారాబాద్, వెలుగు :  అనంతగిరి గుట్టను 213 ఎకరాల్లో ఎకో టూరిజం కింద అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.  గురువారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యాలయంలోని సంబంధిత అధికారులు, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ ప్రతినిధులతో ఈకో టూరిజం అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  అనంతగిరి పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి 213 ఎకరాల విస్తీర్ణంలో పనులను చేపట్టాలన్నారు.  

అనంతగిరి పద్మనాభ స్వామి దేవస్థానం, కోటిపల్లి ప్రాజెక్టుతో సమానంగా సర్పన్ పల్లి ప్రాజెక్టును కూడా టూరిజంలో భాగంగా అభివృద్ధి పరచాలన్నారు.  ఈ సమావేశంలో డీఎఫ్ఓ  జ్ఞానేశ్వర్, టూరిజం అధికారి హనుమంతరావు, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ చలమారెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి మాధవిలతో పాటు ఎల్అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ ప్రాజెక్టు మేనేజర్ సుమలత వారి బృందం సభ్యులతో పాల్గొన్నారు.