
కాళేశ్వరం పర్యటనలో భాగంగా లక్ష్మీ బ్యారేజీ క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు కలెక్టర్లు. క్యాంపు ఆఫీస్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షిస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి లక్ష్మీ బ్యారేజ్ పరిశీలించేందుకు బయలుదేరుతారు. విజిట్ తర్వాత అక్కడ నుంచి కాళేశ్వరం వెళ్లి ముక్తీశ్వర స్వామిని దర్శించుకోనున్నారు కలెక్టర్లు. ఆ తర్వాత కన్నెపల్లి పంప్ హౌజ్ కు చేరుకొని లక్ష్మీ పంప్ హౌస్ ను పరిశీలించనున్నారు. అక్కడ మోటార్ల పనితీరు, అప్రోచ్ కెనాల్, కన్నెపల్లి – అన్నారం గ్రావిటీ కెనాల్ లో డెలివరీ సిస్టమ్ ను పరిశీలిస్తారు. ఆ తర్వాత నంది మేడారం వెళ్లి అక్కడి అండర్ గ్రౌండ్ పంప్ హౌస్, బాహుబలి మోటార్ల పనితీరును పరిశీలించనున్నారు కలెక్టర్లు.