ఆర్మూర్ జనహిత పాదయాత్రలో వరంగల్ జిల్లా నాయకులు

ఆర్మూర్ జనహిత పాదయాత్రలో వరంగల్ జిల్లా నాయకులు

గ్రేటర్​ వరంగల్, వెలుగు: రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన జనహిత పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పాదయాత్ర, ప్రభాత్ పేరి, శ్రమదానం కార్యక్రమాల్లో వరంగల్​ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రాష్ర్ట కాంగ్రెస్​ పార్టీ మైనార్టీ నాయకుడు మహ్మద్​ఆయూబ్​మాట్లాడుతూ తెలంగాణ ఇన్​చార్జి ఏఐసీసీ కార్యదర్శి కుమారి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మంత్రి సీతక్క, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నిజామాబాద్ జిల్లా ఇన్​చార్జి అజ్మాతుల్లా హుస్సేన్​తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నామని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు.