
మహబూబాబాద్, వెలుగు: మానుకోటలో గోపా స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వికాస్ డిగ్రీ కాలేజ్లో ఆదివారం గోపా జిల్లా కమిటీ అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ సంస్థ (గోపా) ఆవిర్భవించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు.
జిల్లాలో పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన గౌడ విద్యార్థులు యాసారపు వెన్నెల, మారగాని సాయిని సన్మానించారు. కార్యక్రమంలో గోపా జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాస్, గోపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిక్కి వెంకటేశ్వర్లు, చీకటి శ్రీనివాస్, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ అధ్యక్షుడు జెర్రిపోతుల వెంకన్న, ఉపాధ్యక్షుడు పెద్ది వెంకన్న తదితరులు పాల్గొన్నారు.