ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : జిల్లాల కలెక్టర్లు

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : జిల్లాల కలెక్టర్లు

ఇల్లెందు/టేకులపల్లి/ పర్వతగిరి/ కాశీబుగ్గ/ జనగామ అర్బన్/ భీమదేవరపల్లి/ ఎల్కతుర్తి, వెలుగు:  రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం పలు కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు వ్యవసాయ మార్కెట్​ కమిటీ, ఇల్లెందు, టేకులపల్లి మండలం చల్లసముద్రం, బోడులలో మక్కల కొనుగోలు కేంద్రాలను కలెక్టర్​ అంకిత్​ పరిశీలించి, ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు.

వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం చెరువుముందు తండాలో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్​ సత్యశారద పరిశీలించి, సమస్యలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టరేట్​లో జిల్లా యంత్రాంగంతో మక్కల కొనుగోళ్లపై రివ్యూ నిర్వహించారు. జనగామ కలెక్టరేట్​లో మక్కల కొనుగోళ్లపై కలెక్టర్​ సందీప్​ కుమార్​ ఝా అడిషనల్​ కలెక్టర్​ బెన్​షాలోమ్​తో కలిసి సమీక్ష జరిపారు. గన్ని బ్యాగుల నిల్వలు, హమాలీల అందుబాటు, గోదాముల సామర్థ్యం, రవాణా పరంగా తీసుకున్న చర్యల వివరాలను మార్క్​ఫెడ్ డీఎం‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

కొనుగోలు కేంద్రాల పనితీరుపై అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, పర్యవేక్షించాలన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో కలెక్టర్​ చాహత్​బాజ్​పాయ్​ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. మాణిక్యపూర్​లోని రైస్​మిల్​ను పరిశీలించారు. ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న మక్కల కొనుగోలు సెంటర్​ను పరిశీలించారు.