రామారావ్ ​మహరాజ్​ పేరు పాలిటిక్స్​లో వద్దు : యాదగిరి

రామారావ్ ​మహరాజ్​ పేరు పాలిటిక్స్​లో వద్దు : యాదగిరి

నిజామాబాద్, వెలుగు: గిరిజనులు ఆరాధ్యదై వం రామారావ్​మహరాజ్​పేరును రాజకీయాల్లో వాడొద్దని ఎంపీ అర్వింద్​కు జిల్లా కాంగ్రెస్​అనుబంధ ఎస్టీ సెల్​ ప్రెసిడెంట్​యాదగిరి సూచించారు. ఆదివారం ఆయన డీసీసీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్​ పార్లమెంట్​ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేసి రామారావు విగ్రహాలను పంపిణీ​చేశారన్నారు. 2019 ఎన్నికల్లో గిరిజనుల అండతో ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన ఆదివాసీలకు చేసిన మేలు ఏం లేదన్నారు. 

తండాల అభివృద్ధికి కేంద్రం నుంచి రూపాయి కూడా తేలేదన్నారు. ఆయనకు గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతం నుంచి 12 శాతానికి పెంచేందుకు పోరాటం చేయాలన్నారు. సెంట్రల్​గవర్నమెంట్​ను ఒప్పించి బ్యాక్​లాగ్​పోస్టులు భర్తీ చేయించాలన్నారు. జిల్లాకు ఎన్ఐటీ, ఐఐటీ కాలేజీలు తేవాలన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టులో గిరిజన జడ్జిలను అపాయింట్ చేయాలన్నారు. బీజేపీ గిరిజన, ఆదివాసీల వ్యతిరేక పార్టీ అన్నారు. కిసాన్​కాంగ్రెస్​జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, తారాచంద్​నాయక్, రవి నాయక్, శ్రీను, నరేందర్, మోతీలాల్​తదితరులు పాల్గొన్నారు.