సీ-విజిల్ యాప్‌‌లో ఫిర్యాదు చేయాలి : రాహుల్​ రాజ్​

సీ-విజిల్ యాప్‌‌లో ఫిర్యాదు చేయాలి : రాహుల్​ రాజ్​

మెదక్​ టౌన్, వెలుగు: పార్లమెంట్‌‌ ఎన్నికల కోడ్‌‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే  ప్రజలు సీ-విజిల్​యాప్‌‌లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్‌‌‌‌ రాహుల్ రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.  ఓటర్లను మభ్య పెట్టేందుకు ఎవరైనా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేస్తే వారి  ఫొటోలు, వీడియోలను పంపాలన్నారు.  ఫొటోలు, వీడియోలు తీసేటప్పుడు, అప్‌‌లోడ్​ చేసే సమయంలో జీపీఎస్​ ఆన్‌‌లో ఉంచాలని సూచించారు.

జీపీఎస్‌‌ ద్వారా  లోకేషన్ నమోదు అవుతుందని, సభలు, సమావేశాల్లో విద్వేషపూరిత కామెంట్స్ చేసినా,  అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించినా చర్యలు తీసుకుంటామన్నారు.  సీ--విజిల్ యాప్‌‌కు ఫిర్యాదు వచ్చిన 100 నిమిషాల్లో  అధికారులు స్పందిస్తారని స్పష్టం చేశారు. యాప్‌‌పై కలెక్టరేట్‌‌లో 24 గంటల పాటు  మానిటరింగ్ ఉంటుందని, 1950 టోల్ ఫ్రీ  నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుదారుల పేర్లు, ఫోన్​నెంబర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. 

ప్రజావాణి రద్దు

పార్లమెంట్‌‌ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్‌‌లో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులు, సిబ్బంది పార్లమెంట్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసే వరకు  ప్రజావాణి కార్యక్రమం ఉండదని, ప్రజలు ఈ  విషయాన్ని గమనించాలని కోరారు.