ఎన్నికల నిర్వహణ ..సజావుగా జరగాలి

ఎన్నికల నిర్వహణ ..సజావుగా జరగాలి
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్

సంగారెడ్డి టౌన్ ,వెలుగు : ఎన్నికలను సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ చెప్పారు. . శుక్రవారం సంగారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని,  అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్స్ ను, స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నారు. నిబంధనల మేరకు నడుచుకోవాలని తెలిపారు. కలెక్టర్ వెంట రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి, తహసీల్దార్లు, డీటీలు ఉన్నారు. 

ఎన్నికల గ్రీవెన్స్​ సెల్​ విభాగం ఏర్పాటు

మెదక్ టౌన్ :  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల  గ్రీవెన్స్​ సెల్​ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షిషా తెలిపారు. ఇందులో డీఆర్​డీఏ పీడీ శ్రీనివాస్​, జిల్లా ఆడిట్​ ఆఫీసర్​ రాకేశ్​, జిల్లా ట్రెజరీ అధికారి చిన్నసాయిలు సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోసం నియమించిన  స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్​ (ఎస్​వోపీ)లో భాగంగా స్టాటస్టిక్ సర్వేలెన్స్​,  ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, వీడియో సర్వేలెన్స్  బృందాలు, వీడియో వీవింగ్  బృందాలు, ఎంసీసీ బృందాలతో  ఫ్లయింగ్​ స్క్వాడ్ టీమ్​లు పని చేస్తాయని తెలిపారు.

పోలీసులు తనిఖీల్లో  ఎక్కడైనా ఎలాంటి రశీదు లేకుండా రూ.50 వేల కంటే ఎక్కువగా నగదు పట్టుబడితే సీజ్ చేయాలని సూచించారు. అలాగే రూ. లక్ష నుంచి రూ. పది లక్షల వరకు ఉన్నట్లయితే ఇన్​కమ్​ ట్యాక్స్​ఆఫీసర్లకు సమాచారం అందించాలన్నారు. పట్టుబడిన  నగదుకు సరైన పత్రాలను,  ఎన్నికల  గ్రీవెన్స్  విభాగంలో సమర్పించి తమ నగదును తిరిగి పొందవచ్చని పేర్కొన్నారు.  ఎవరికి అనుమానం ఉన్నా 1950 హెల్ప్ లైన్ కు ఫోన్​ చేయాలన్నారు.